‘జొమాటో ప్రో’ మెంబర్ షిప్ నిలిపివేత.. కొత్త పథకంపై కసరత్తు

  • రెన్యువల్ కు అవకాశం ఉండదని స్పష్టీకరణ
  • ప్రస్తుత సబ్ స్క్రిప్షన్ ముగిసే వరకు యథావిధిగా సేవలు
  • మరింత మెరుగైన పథకంపై పనిచేస్తున్నట్టు ప్రకటన
జొమాటో యూజర్లకు షాక్ ఇచ్చింది. డిస్కౌంట్స్ తో కూడిన ప్రో మెంబర్ షిప్ (సభ్యత్వం) కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కొంత కాలం క్రితం జొమాటో ప్రో ప్లస్ నిలిపివేసినట్టుగానే ఇది కూడా కనిపిస్తోంది. జొమాటో ప్రో సభ్యులు జొమాటో యాప్ పై అదనంగా డిస్కౌంట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. డెలివరీ చార్జీ కూడా ఉండదు. 

జొమాటో ప్రో సభ్యత్వం ముగిసి, రెన్యువల్ చేసుకోవాలని అనుకుంటున్న వారికి ఒక సందేశం వస్తోంది. ‘‘జొమాటో ప్రో కార్యక్రమంలో భాగమైనందుకు ధన్యవాదాలు. సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం కుదరదు. నూతన, మరింత మెరుగైన పథకంపై పనిచేస్తున్నాం’’ అని సందేశం వస్తోంది. 

జొమాటో కొత్తగా మరింత ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకువచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘‘ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మా కస్టమర్లు, రెస్టారెంట్ భాగస్వాములతో కలసి ఓ కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కనుక జొమాటో ప్రో, జొమాటో ప్రో ప్లస్ సభ్యులను పునరుద్ధరించడం లేదు. ప్రస్తుత సబ్ స్క్రిప్షన్ ముగిసేవరకు వారికి ప్రయోజనాలు కొనసాగుతాయి’’ అని జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు.

Zomato
Pro membership
discontinued

More Telugu News